Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్‌కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో సోమవారం జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై చర్చ, ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్ విదేశాలకు వెళ్లి ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్, ఇండియా కూటమిలో ఆందోళన కలిగించింది. కేరళలోని కన్నూర్ ఎంపీ అయిన సుధాకరన్ ప్రస్తుతం దుబాయ్‌లోని ఒక ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ జోక్యం, కుట్ర ఉందని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుధాకరన్ కుటుంబ సభ్యులు ఆదివారం ఆరోపించారు. దుబాయ్‌లో మీడియాతో మాట్లాడిన సుధాకరన్ కుమారుడు సంజోగ్, శుక్రవారం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు.
నాడీ సంబంధిత (న్యూరోలాజికల్) సమస్య కారణంగా 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారని, శనివారం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ఆదివారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. అయితే.. ఆదివారం ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆసుపత్రి యాజమాన్యం ఆయనను అకస్మాత్తుగా ఐసీయూలోకి మార్చి, కుటుంబ సభ్యులను కలవకుండా అడ్డుకుందని సంజోగ్ ఆరోపించారు. ‘ఎవరో బాస్ నుంచి ఫోన్ వచ్చిందని’ వైద్యులు చెప్పారని, ఆదివారం తన తండ్రి ఢిల్లీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
- Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
- Rajini - Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
- Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
ఈ పరిణామంపై కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎంపీని కుటుంబ సభ్యులు కలవకుండా అడ్డుకోవడం, కేంద్ర ప్రభుత్వ జోక్యం ఆరోపణలు తీవ్రమైనవని అన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుధాకరన్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఆయన కుమారుడికి ఫోన్ చేసి, లోక్‌సభ సమావేశాల ప్రాముఖ్యత దృష్ట్యా తక్షణమే ఢిల్లీకి తిరిగి రావాలని కోరామని, చర్చ ముగిసిన వెంటనే ఢిల్లీలో పూర్తి స్థాయి చికిత్సకు పార్టీ ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చామని తెలిపారు.
2021 నుంచి 2024 వరకు కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సుధాకరన్, గత ఏప్రిల్‌లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నూర్ నుండి పోటీ చేసేందుకు టికెట్ ఆశించి భంగపడటంతో పార్టీ నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రతి ఓటును కూడగడుతున్న తరుణంలో ఆయన హాజరు కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్‌కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
-
Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!