NTV Telugu Site icon

Congress MLA’s : బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..?

Congress

Congress

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజుల అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. ఈ మేరకు ఏ రంగాలకు ఏ విధంగా కేటాయింపులు జరిపారో వెల్లడించారు. అంతేకాకుండా.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ప్రభుత్వ పాలనపై వెల్లడించారు. అయితే.. ఈ బడ్జెట్‌లోపై ప్రధాని విపక్ష పార్టీ బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్పందించారు.. మధన్ మోహన్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం బడ్జెట్ అని, ఇది రైతు బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన పదేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులు అని డబ్బులు తగలేశారని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు.. త్రాగు నీటి సదుపాయాలు లేవన్నారు. స్కూల్స్ లో టీచర్స్ లేరని, వైద్య, విద్య రంగాలకు నిధులు కేటాయింపు చేయడం జరిగిందన్నారు. జాబ్ క్యాలండర్ కూడా పెట్టడం జరిగిందని, సెప్టెంబర్ 5,6 లోగా గ్లోబల్ మేదో సంపత్తి కోసం స్కిల్ యునివర్సిటీ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం కు లక్షల కోట్లు తగల వేశారని, అన్ని రంగాలకు ,సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు పెట్టారన్నారు.

Read Also : Google Chromecast: క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌లను నిలిపివేసిన గూగుల్..

కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరి అంకెల రూపంలో బడ్జెట్ పెట్టకుండా.. అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించాము. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కో రంగానికి ఎన్ని డబ్బులు కేటాయిస్తున్నం అనేది విపులంగా వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జరగాలని కేటాయింపులు చేయడం జరిగింది. గత బడ్జెట్ లో కన్న వైద్య విద్య కోసం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఎక్కడ సిబ్బంది లేదు. 9వేల పై చిలుకు బడ్జెట్ పెట్టీ.. వైద్య విద్య కు పూర్వవైభవం తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ ను తులనాడే విధంగా కేసిఆర్ మాట్లాడారు. గత బడ్జెట్ పెపర్లకు పరిమితం అయ్యింది. కేసిఆర్ ఇంకా ఊహల్లో ఉండకుండా.. బడ్జెట్ ను ఆహ్వానించాలి.’ అని అన్నారు.

Also Read : Rashmika: దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. వాస్తవానికి బడ్జెట్ దగ్గర ఉంది. అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గంగలో కలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటికే చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఇప్పటికి పెండింగ్ బిల్లులు రావడం లేదు. వంశీ కృష్ణ..అచ్చం పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కేసీఆర్ మీడియా పాయింట్ కి వచ్చిండు.. తొందర్లోనే కోర్టు బోన్ లోకి వస్తాడు.. కేసీఆర్ ఊహల్లో బతికిండు.. ఇంకా నేనే రాజు అనుకుంటున్నాడు.. మీరు పెట్టిన బడ్జెట్ ఎవరికి ఉపయోగపడలేదు.. నీళ్ళు నిధులు నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకుంది.. కానీ గత ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు..నిధులూ ఇవ్వలేదు.. ఇంక నియామకాల ఉసే అస్సల్ లేదు.. అప్పులు చేసి తెలంగాణ ప్రజల జీవితాలపై వేశారు..’ అని వ్యాఖ్యానించారు.