Jagga Reddy: పుస్తకమే చాలా లావుగా ఉంది.. అందులో మ్యాటర్ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy on Telangana Budget: నేడు అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు గవర్నర్ ప్రసంగంలో రాలేదని.. కనీసం ఈ బడ్జెట్ లోనైనా వస్తాయని ఆశ ఉండేదన్నారు. హరీష్ రావు బడ్జెట్ పుస్తకం చాలా లావుగా ఉందని..కానీ అందులో మ్యాటర్ లేదన్నారు. కాన్సర్ రోగులు, గుండె రోగుల ప్రస్తావన బడ్జెట్లో రాలేదని ఆయన మండిపడ్డారు. వీఆర్ఏ, ఆర్ఎంపీ లాంటి వాళ్ల గురించి చర్చే లేదన్నారు. విభజనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల గురించి బడ్జెట్లో లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka: కలల బడ్జెట్ మాత్రమే.. వాస్తవ బడ్జెట్ కాదు..
Also Read
యాదగిరి గుట్టకు మెట్రో కావాలని డిమాండ్ చేశామన్న ఆయన.. కానీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. పుస్తకం తెచ్చి పాఠం చదివి వెళ్లారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అనాథ పిల్లలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని.. కానీ బడ్జెట్లో ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ లోపల, బయట పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బడ్జెట్ సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!