ఓ ప్రజాప్రతినిధి హద్దులు దాటాడు. చుట్టు జనం ఉన్నారనే కనీస ఇంగితం మరిచిపోయాడు. తనతో డ్యాన్కస్ చేసిన అమ్మాయిని ముద్దు పెట్టేశాడు. డ్యాన్స్ చేస్టుంటే కార్యకర్తలు మురిసిపోయారు. ఒకరి తర్వాత ఒకరు చిందులేశారు. అంతే కాదు వీడియో కూడా తీశారు. తమ అభిమాన నేత అలా చేస్తాడని ఎవరు ఊహించలేకపోయారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చివర తమ నేత చేసిన పిచ్చి పనికి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read : MP Ranjith Reddy : తెలంగాణలో రైతుని రాజు చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు చెందిన గున్నౌర్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో గున్నౌర్ ఎమ్మెల్యే రాయ్ డ్యాన్సర్ తో దుమ్మురేపాడు. ఝల్ మంజీర ట్యూన్ లో డ్యాన్స్ చేయడంలో అతను ఎంతగా మునిగిపోయాడో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. పాటలు పాడేందుకు వచ్చిన ఆ మహిళ చేయి పట్టుకుని డ్యాన్స్ చేస్తూ.. చివర్లో డ్యాన్స్ స్టెప్పుల నుంచి ఓ అడుగు ముందుకేశాడు. డ్యాన్స్ చేస్తున్న మహిళకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చేశాడు.
Also Read : Jagananna Vasathi Deevena: శుభవార్త చెప్పిన సీఎం జగన్.. రేపే వారి ఖాతాల్లో నిధుల జమ
ఈ రసవత్తరమై సీన్ చూసిన సొంత పార్టీ కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు. మరింత చప్పట్లు కొడుతూ పాటలు పాడటం మొదలు పెట్టారు. అయితే ఈ వీడియో తీసిన మరో కార్యకర్త తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇదేంటి మహాషయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గున్నౌర్ అసెంబ్లీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీ అశ్లీల డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే, రాయ్ డ్యాన్సర్ తో వైరటీగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇది మాత్రమే కాదు.. విద్యార్థి తన పెదవులపై నోటును పెట్టుకునప్పుడు.. ఆ మహిళ తన పెదవులతో ఆ నోటును తన వైపుకు లాగడంతో అశ్లీలత హద్దులు దాటింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
