NTV Telugu Site icon

MLA Gun Fire: డ్యాన్స్ చేస్తూ సడన్‎గా జేబు నుంచి గన్ తీసిన ఎమ్మెల్యే.. షాకైన స్థానికులు

Congress Mla

Congress Mla

MLA Gun Fire: న్యూ ఇయర్ వేడుకల్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు. వేడుకల్లో భాగంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ సడన్ గా గన్ తీసి కాల్చడం మొదలు పెట్టారు.. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారిది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Read Also: Houses are not sold : ఇకపై ఆ దేశంలో ఫారెనర్స్‎కు ఇళ్లు అమ్మరట

కోట్మా నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి ఎక్కి డ్యాన్స్‌ చేసి కాసేపు ఆహుతులను అలరించారు. ఉన్నట్లుండి అందరూ చూస్తుండగానే ఆయన తన జేబు నుంచి రివాల్వర్‌ను బయటకు తీశారు. అనంతరం డ్యాన్స్‌ చేస్తూ గన్‌ను ఎక్కుపెట్టి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.

కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై ఇటీవల కూడా ఒక కేసు నమోదైంది. భర్త, పిల్లలతో కలిసి రేవాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన మహిళను మద్యం మత్తులో ఉన్న ఆయన, మరో ఎమ్మెల్యేతో కలిసి లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ భర్త ట్విట్టర్‌ ద్వారా పోలీసుల సహాయం కోరాడు. రైల్వే పోలీసులు ఆ మహిళకు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

Show comments