Site icon NTV Telugu

Revanth Reddy: మన మునుగోడు-మన కాంగ్రెస్ షెడ్యూల్ ఇదే!

Congress

Congress

మునుగోడుపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు మునుగోడు నియోజక వర్గంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మన మునుగోడు, మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేసాం అని తెలిపారు రేవంత్ రెడ్డి. ఉదయం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించాలి. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన త్యాగం, సేవలు, దేశాభివృద్ధి గురించి మాట్లాడాలి..

అలాగే మునుగోడు నియోజక వర్గంలో బీజేపీ, టిఆర్ఎస్ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతుంది. నాయకులను నిస్సిగ్గుగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుంది. దేశంలో ఎన్నడూ, ఎక్కడ లేని విదంగా రాజకీయ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ దుర్మార్గాలు శ్రుతి మించిపోయాయి.. వాళ్ళను ఎదుర్కోవడానికి మనం ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజాస్వామ్యానికి వందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు రేవంత్ రెడ్డి. నాతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాడాలి.

రెండు అధికార పార్టీ లు వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఈ ఉప ఎన్నికల్లో అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్నారు. మనం వెయ్యి మంది నాయకులు లక్ష మంది కి వందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం. నేను కూడా స్వయంగా మునుగోడు లోని తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వారికి వందనాలు చేయడం ద్వారా ప్రజాస్వామిన్ని పరిరక్షించే యుద్ధంలో పాల్గొనబోతున్నాం. మనం అధికార పార్టీల అక్రమాలను అడ్డుకోవాలంటే ప్రజాస్వామ్య పరిరక్షన ఉద్యామం పెద్ద ఎత్తున చేపట్టాలి. నేను పొర్లుతండా గ్రామంలో రేపు ఉదయం రాజివ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొంటాను.. 12 గంటలకు చౌటుప్పల్ లో ప్రెస్ మీట్ లో పాల్గొంటాను.. నాయకులు, కార్యకర్తలు మీ కార్యక్రమాల తర్వాత చౌటుప్పల్ కు రావాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యానికి వందనం పేరుతో కార్యక్రమం వుంటుందన్నారు. ఒక్కో నాయకుడు వంద మందికి వందనం చేస్తారు. వెయ్యి మంది నాయకులు..లక్ష మందికి వందనం చేసి ప్రజాస్వామ్యం కాపాడండి అని అడుగుతాం. తెలంగాణ సాయుధ పోరాట యోధుల కుటుంబాలకు రేవంత్ వందనం చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Read Also: China: కరువు కోరల్లో చైనా.. “జాతీయ కరువు హెచ్చరిక” జారీ

Exit mobile version