NTV Telugu Site icon

Congress Leaders: రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు..

Rajbhavan

Rajbhavan

తెలంగాణ రాజ్ భవన్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేయనున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ను వారు కోరారు.

Read Also: Salaar Vs Dunki: 24 గంటల్లో సలార్ ట్రైలర్ రికార్డ్స్ ని డంకీ ట్రైలర్ బీట్ చేయలేకపోయింది

సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేవంత్ సీఎంగా తన పేరు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు.. ఎంపీ మాణిక్ ఠాగూర్, కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని వారిని రేవంత్ కోరారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూడా సమావేశం అయి.. వారిని తన ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే, ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులకు ఆహ్వాహానాలు పంపిచారు. ఇక, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పలికారు. ఇంత మంది ప్రముఖుల మధ్య రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.