తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఆగొద్దని మళ్లీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవాబుపేట్ మండలంలోని చెన్నారెడ్డి పల్లె, కేశవరావు పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దాదాపు 40 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేశవరావు పల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవితో పాటు 20 మంది ముఖ్య నాయకులు చేరారు అని ఆయన తెలిపారు.
Read Also: Leo Producer: ఈ సినిమా వెయ్యి కోట్లని టచ్ చెయ్యదు…
అయితే, నిన్న ( శుక్రవారం ) చెన్నారెడ్డిపల్లిలోని 20 మందికి బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పగా నేడు తిరిగి సొంత పార్టీలోనే ఉంటామని వారు బీఆర్ఎస్ లో చేరారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన సీఎం కేసీఆర్ సభకు జడ్చర్ల పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చారని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పడానికి అదే నిదర్శనం అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. లక్ష మెజార్టీ సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.