Shashi Tharoor : కేరళంలో కాంగ్రెస్ అగ్రనాయకుడి కాన్వాయ్‌పై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor : కేరళంలో పర్యటిస్తున్న ఒక కాంగ్రెస్ అగ్రనేత కాన్వాయ్‌పై గుర్తు తెలియని వాళ్లు దాడి చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మలప్పురం జిల్లా వాండూర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ యూడీఎఫ్ అభ్యర్థి ఏ.పి.అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించడమే కాకుండా, ఆయన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
READ ALSO: Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
థరూర్ బృందం రెండు వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. శశి థరూర్ మొదటి వాహనంలో ఉన్నారు. అకస్మాత్తుగా, రెండు కార్లలో వచ్చిన సుమారు ఎనిమిది మంది వ్యక్తులు థరూర్ వాహనాన్ని రోడ్డు మధ్యలో బలవంతంగా ఆపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. దుండగులు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకుని, కారు కిటికీలపై దాడి చేయడం ప్రారంభించారన్నారు. ఇదే సమయంలో శశి థరూర్ గన్‌మ్యాన్ జోక్యం చేసుకుని రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నించగా, అల్లరిమూకలు అతనిపై కూడా దాడి చేశాయన్నారు. ఆ గన్‌మ్యాన్‌ను తోసివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకుందని, వెంటనే పోలీసులకు వెంటనే సమాచారం అందించినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడి ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందా లేదా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 140 మంది సభ్యులు గల కేరళం శాసనసభకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలను మే 4న ప్రకటించనున్నారు.
READ ALSO: Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!