Site icon NTV Telugu

Shashi Tharoor : కేరళంలో కాంగ్రెస్ అగ్రనాయకుడి కాన్వాయ్‌పై దాడి..

Shashi Tharoor (1)

Shashi Tharoor (1)

Shashi Tharoor : కేరళంలో పర్యటిస్తున్న ఒక కాంగ్రెస్ అగ్రనేత కాన్వాయ్‌పై గుర్తు తెలియని వాళ్లు దాడి చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మలప్పురం జిల్లా వాండూర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ యూడీఎఫ్ అభ్యర్థి ఏ.పి.అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనాన్ని అడ్డగించడమే కాకుండా, ఆయన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

READ ALSO: Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!

థరూర్ బృందం రెండు వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. శశి థరూర్ మొదటి వాహనంలో ఉన్నారు. అకస్మాత్తుగా, రెండు కార్లలో వచ్చిన సుమారు ఎనిమిది మంది వ్యక్తులు థరూర్ వాహనాన్ని రోడ్డు మధ్యలో బలవంతంగా ఆపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. దుండగులు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకుని, కారు కిటికీలపై దాడి చేయడం ప్రారంభించారన్నారు. ఇదే సమయంలో శశి థరూర్ గన్‌మ్యాన్ జోక్యం చేసుకుని రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నించగా, అల్లరిమూకలు అతనిపై కూడా దాడి చేశాయన్నారు. ఆ గన్‌మ్యాన్‌ను తోసివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకుందని, వెంటనే పోలీసులకు వెంటనే సమాచారం అందించినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడి ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందా లేదా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 140 మంది సభ్యులు గల కేరళం శాసనసభకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలను మే 4న ప్రకటించనున్నారు.

READ ALSO: Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!

Exit mobile version