NTV Telugu Site icon

Rahul gandhi: వయనాడ్‌లో రాహుల్ నామినేషన్.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు

Rahul

Rahul

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి అయిన వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని ప్రమాణం చేశారు. అంతకుముందు… వయనాడ్‌లో రాహుల్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ నుంచి ముప్పాయనాడ్ గ్రామానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా కాల్ పెట్ట వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాహుల్ రోడ్ షో ప్రారంభమై వయనాడ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.

నామినేషన్ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ, కేసీ. వేణుగోపాల్‌, NSUI AICC ఇన్‌ఛార్జ్ కన్హయ్య కుమార్, కేరళలో ప్రతిపక్ష నేత సతీశన్ , KPCC తాత్కాలిక అధ్యక్షుడు హసన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

రాహుల్ గాంధీ మళ్లీ సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అమేథీ నుంచి, వయనాడ్ నుంచి పోటీ చేశారు. కానీ అమేథీలో ఓడిపోయి.. వయనాడ్‌లో గట్టెక్కారు. ఈసారి అమేథీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు కానీ.. తిరిగి వయనాడ్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా కూడా వాయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: Manda Krishna: తన బిడ్డ భవిష్యత్‌ కోసమే.. కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ వయనాడ ప్రజలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇటీవల ఏనుగుల దాడుల వల్ల ప్రజలు చనిపోతున్నారని.. దీనికి రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపారు. ఈసారి ఢిల్లీలోనూ, కేరళలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.

ఇది కూడా చదవండి: Arvind Kejriwal: నన్ను అవమానించడమే అరెస్ట్ ఏకైక లక్ష్యం.. బెయిల్‌పై విచారణ..

జరగబోయే ఎన్నికలు భారత రాజ్యాంగం కోసం.. ప్రజాస్వామ్యం కోసం జరగుతున్న ఎన్నికలని తెలిపారు. ప్రజాస్వా్మ్యాన్ని.. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకునే శక్తులు ఇంకోవైపు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ఏ పార్టీతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సంరక్షించపబడుతుందో ప్రజలందరికీ తెలుసు అని రాహుల్ వ్యా్ఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Anasuya : అనసూయ లేటెస్ట్ లుక్స్ అదుర్స్.. హేటర్స్ కోసమే క్యాప్షన్ పెట్టిందా?

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతుంది. అనంతరం ఏప్రిల 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

Show comments