Site icon NTV Telugu

Ponnala Lakshmaiah : ప్రజలను రెచ్చగొట్టడంలో బీజేపీ ముందు ఉంటది

Ponnala Lakshmaiah

Ponnala Lakshmaiah

తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మనుగోడు నియోజకర్గం చుట్టూ తిరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడులో ఉప ఎన్నిక రానుంది. దీంతో.. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ లు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలు దృష్టి తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. అభివృద్ధి జరగలేదని ఒక శాసనసభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యాడని, బీజేపీ, కేసీఆర్ బహిరంగ సభలకు జనాలు వచ్చారని చెపుతున్నారు.. ఎన్నికల సమావేశాలకి ప్రజలు రాలేనిది ఉందా అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల మీటింగ్ లకు జనం వస్తారు. ఎట్లా వస్తారో అందరికి తెలుసునన్నారు. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో చార్మినార్ దగ్గర ఆలయంలో అమిత్ షా మొక్కి వెళ్ళాడు… సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నిన్న అమిత్ షా దర్శించుకున్నాడు… ఎన్నికలు వస్తే ఆలయాలు బీజేపీ వాళ్ళకి గుర్తుకొస్తాయా.. మొన్న కేసీఆర్, నిన్న అమిత్ షా మునుగోడులో మీటింగ్ పెట్టారు.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మోసం చేసింది బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు.

 

బీజేపీ అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17విమోచన దినం జరుపుతామని అంటున్నారు.. ప్రజలను రెచ్చగొట్టడంలో బీజేపీ ముందు ఉంటది.. నిన్న బహిరంగ సభలో అమిత్ షా ఈ 8 సంవత్సరాలు బీజేపీ ఏం చేసిందో చెప్పాడా.. నీళ్లు ,నిధులు, నియామకాలు అన్న నీవు కృష్ణ జలాల్లో వాటా ఎంతో తెలియకుండా ఈ ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశావా కేసీఆర్… విద్యుత్ సంస్థలు బాకీలున్నాయ్ అని ప్రైవేట్ పరం కోసం నోటిఫికేషన్ వేయడం సిగ్గు చేటు.. కేసీఆర్ నీకు 8ఏళ్ళు కేంద్రంపై ఎక్కడ పోరాటం చేశావు.. కృష్ణా జలాలపై తెలంగాణ వాటా ఎంత అని మునుగోడు ఎన్నికల ముందు అడుగుతావా.. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టే కుట్ర చేస్తున్నావ్.. కేసీఆర్ పూర్వీకులు ఎక్కడ ..? కేసీఆర్ దోపిడీ దారుడని చెప్పిన బీజేపీ నేతలు.. ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి జరగడం లేదని రాజీనామా చేసాడు.. అంటే వచ్చే ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి అయితదా ..కేంద్ర నిధులు వస్తాయా.. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు మూడే సమయం దగ్గర పడింది అంటూ ఆయన ధ్వజమెత్తారు.

 

Exit mobile version