మునుగోడు చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే నిన్న మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం హోదా లో మాట్లాడాల్సిన మాటలా.. బట్టే బాజ్ మాటలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నోరా… ఇంకేమైననా..? అంటూ ధ్వజమెత్తారు మధు యాష్కీగౌడ్. అంతేకాకుండా కాంగ్రెస్ లేకుంటే… తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్..నరేంద్ర ను… కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళను మోసం చేసినవు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన తీరు…అక్షేపనీయం. నీలాంటి నీచుడు సీఎం అయ్యాడు కాబట్టే… దోపిడీ అవుతుంది. నీలాంటి నికృష్టుడు వంద ఎండ్లు తల కిందుకు వెలాడినా వచ్చేదా తెలంగాణ. ముఖ్య మంత్రి అవ్వాలని తెలంగాణ ఉద్యమం లో జోర్రినవు. నీవి మూతి నాకుడు మాటలు. కాంగ్రెస్ పై కేసీఆర్ మాట్లాడిన బాషా నీ జనం అసహించు కుంటుంది. కేసీఆర్‌కి 900 కోట్లు ఎట్లా వచ్చాయి అంటూ మధు యాష్కీ ప్రశ్నించారు.
