Site icon NTV Telugu

Konda Surekha: కొండా సురేఖకు రోడ్డు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టుకున్న కొండా మురళీ

Konda Surekha

Konda Surekha

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె ప్రమాదానికి బారిన పడ్డారు. అయితే, బైక్ ర్యాలీలో కొండా సురేఖ స్వయంగా స్కూటీ నడిపింది.. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనింది. ఇక, ఈ ర్యాలీలో కొండా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో కుడి కన్నుపై, చేతికి గాయాలు అయ్యాయి. దీంతో తక్షణమే సురేఖను ఆమె వ్యక్తిగత సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక, విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహటిన సురేఖ ఉన్న ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమెకు తగిలిన గాయాలు చూసి మురళీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read Also: Bhagavanth kesari: ‘భగవంత్ కేసరి’లో రతిక… ఏ పాత్రలో నటించిందో తెలుసా?

అయితే, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే రిలీజ్ చేసింది. మొత్తం 55 మందితో కూడిన ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కొండా సురేఖ టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో ఆమె పేరు లేదు.. కనుకా.. రెండో జాబితాలో కొండా సురేఖ పేరు ఉండే అవకాశం కనిపిస్తుంది.

Exit mobile version