Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి ఆహ్వానం అందింది. బీజేపీ నేతకు ఆహ్వానం అందడం ఏమిటని అనుకుంటున్నారా.. ఆహ్వానం అందడం నిజమేనండోయ్. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ కేంద్ర మంత్రిని జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. ఈమేరకు గౌరిగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్మృతి ఇరానీ కార్యదర్శి నరేశ్ శర్మకు లేఖ అందించారు. అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీకి లేఖ రాశానని, రాష్ట్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో చేరాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ గురువారం తెలిపారు. బుధవారం గౌరీగంజ్‌లోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఇరానీ కార్యదర్శి నరేష్ శర్మకు ఆహ్వానాన్ని అందజేసినట్లు సింగ్ తెలిపారు.
President Droupadi Murmu: యాదాద్రీశుడిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా అందరినీ ఆహ్వానించాల్సిందిగా తమ పార్టీ సీనియర్ నేతలు తనకు సూచించారని మాజీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) తెలిపారు. అందరికంటే ముందుగా అమేథీ ఎంపీ స్మృతి జుబిన్ ఇరానీకి ఆహ్వాన పత్రం ఇవ్వాలని తాను అనుకున్నానని వెల్లడించారు. ఆహ్వానం గురించి అడగ్గా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ త్రిపాఠి, అమేథీ ఎంపీ లేదా పార్టీకి చెందిన ఇతర కార్యకర్త యాత్రలో చేరే ప్రశ్నే లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఎంపీగా గెలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాహుల్ గాంధీని ఆమె ఓడించారు. జనవరి 3న ఘజియాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది.
