Site icon NTV Telugu

Jyotiraditya Scindia: కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Centrl

Centrl

కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంతిమ దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. అన్ని విధాలుగా కాంగ్రెస్ పతనావస్థకు చేరుకుందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కొన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదని విమర్శించారు. కొంతమందికి టికెట్లు ఇచ్చినా నామినేషన్ల తర్వాత ఉపసంహరించుకునేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ పార్టీతో ఉండాలని ఎవరూ అనుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: Kottankulangara Devi Temple : పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే చీర కట్టుకొని అలంకరించుకోవాలి..!

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ.. రాజ్యాంగం గురించి పాఠాలు చెప్పడం విచిత్రంగా ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి 91 సార్లు ఆర్టికల్ 356ను ఉపయోగించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో నేతలకు సముచిత గౌరవ మర్యాదలు ఉండవు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Osmania University : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 4 కొత్త కోర్సులు

కాంగ్రెస్‌ పార్టీ నుంచి జ్యోతిరాదిత్య సింధియా 2020లో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన 15 నెలలకు సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరారు. ఫలితంగా కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: Barbie Telugu OTT : ఓటీటీలోకి ఆస్కార్ కొట్టిన హాలివుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Exit mobile version