Congress: మూడో విడతలోనూ హస్తం హవా.. ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. మూడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపర్చిన 2,060 మందికి పైగా సర్పంచ్‌లు విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు భారీగా లభించిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 1,060 మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల గెలుపులను కలిపినా మొత్తం సర్పంచ్ స్థానాల్లో 30 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ MORE: Delhi Pollution: డేంజర్లో ఢిల్లీ కాలుష్యం.. నేడు లోక్‌సభలో చర్చ
Also Read
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్ల విషయంలోనూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో దాదాపు 90 శాతం మంది తమవాళ్లేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అధికారికంగా పార్టీ గుర్తు లేకపోయినా, తమ మద్దతుతోనే చాలా మంది స్వతంత్రులు విజయం సాధించారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల అభ్యర్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ సమయంలోనూ, ఓట్ల లెక్కింపు వేళనూ వాగ్వాదాలు, తోపులాటలు జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆధిక్యతను అందించాయి. ప్రతి ఓటు కీలకమని, గ్రామస్థాయిలో రాజకీయ పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఎన్నికలు మరోసారి స్పష్టంగా చూపించాయి.
తాజావార్తలు
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!