Site icon NTV Telugu

Union Budget: బడ్జెట్‌పై కాంగ్రెస్ విమర్శలు.. పొగడ్తల బడ్జెట్ అంటూ ఎద్దేవా

P,chidambaram

P,chidambaram

సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెప్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌లో పేదలకు ఉపయోగపడేది ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నిలదీశారు. పొగడ్తలకే బడ్జెట్ ప్రసంగం సరిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఇది వీడ్కోలు బడ్జెట్ అని ఆయన విమర్శించారు.

మనీష్ తివారీ..
మరోనేత మనీష్ తివారీ మాట్లాడుతూ.. ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని మండిపడ్డారు. ద్రవ్యలోటు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.

సచిన్ పైలట్..
మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేదని వ్యాఖ్యానించారు. రైతులకు, యువకులకైతే ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పుకొచ్చారు.

Exit mobile version