Site icon NTV Telugu

Mallikarjun Kharge: ఖర్గేకు బెదిరింపులు.. భద్రత పెంచిన కేంద్రం

Cinf'e

Cinf'e

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు (Mallikarjun Kharge) కేంద్రం భద్రత పెంచింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖర్గే ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు నివేదిక అందినట్లు తెలుస్తోంది. దీంతో తాజా నివేదికలను హోంశాఖ సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతగా ఉండనున్నారు.

దేశంలో ప్రముఖ వ్యక్తులకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా సమీక్షించి ఆయా వ్యక్తులకు ఎక్స్‌, వై, వై ప్లస్‌, జెడ్‌, జెడ్‌ ప్లస్‌ భద్రతను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కల్పిస్తుంటుంది. ఈ భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి తదుపరి చర్యలు చేపడుతుంటుంది.

తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు కూడా వై ప్లస్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇటీవల ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందన్న రిపోర్టు ప్రకారం భద్రతను పెంచారు.

 

Exit mobile version