NTV Telugu Site icon

Dinesh Gundurao : 105 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గుండూరావు

Gundu Rao

Gundu Rao

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సర్వత్రా ఉత్కంఠ రేపిన ఫలితాలు ఇవాళ (శనివారం) వెలువడగా, రాజధాని బెంగళూరు నడిబొడ్డున ఉన్న గాంధీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దినేష్ గుండూరావు కేవలం 105 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ గుండూరావు, బీజేపీ అభ్యర్థి సప్తగిరిగౌడ్ మధ్య ఉత్కంఠమైన పోటీ జరిగింది. చివరకు దినేష్ గుండూరావు 113 ఓట్లతో గెలుపొందారు. అయితే, స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన ఫలితాన్ని మళ్లీ లెక్కించాలని సప్తగిరి గౌడ్‌ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

Also Read : Vinay Kulkarni : ప్రచారం చేయకుండానే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

బీజేపీ అభ్యర్థి సప్తగిరి గౌడ్‌ మళ్లీ ఓట్లు లెక్కించాలని కోరడంతో రీకౌంటింగ్ అనంతరం దినేష్ గుండూరావు కేవలం 105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాజీ మంత్రి రాంచంద్రగౌడ్ తనయుడు సప్తగిరిగౌడ్ జిడ్డాజిడ్డి నియోజకవర్గం నుంచి గాంధీనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే జేడీఎస్ పార్టీ నుంచి వి. నారాయణస్వామి, బీజేపీ టికెట్ నిరాకరించిన మాజీ మంత్రి కృష్ణయ్య శెట్టి పార్టీయేతర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

Also Read : Karnataka Elections: చాలెంజ్‌ అంటే ఇదే.. భారీ మెజార్టీతో విక్టరీ కొట్టిన 92 ఏళ్ల కురువృద్ధుడు

బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గంలో సౌమ్యారెడ్డి కేవలం 160 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీజేపీ అభ్యర్థి మళ్లీ ఓట్లు లెక్కించాలని ఈసీని అభ్యర్థించింది. కానీ దానికి అధికారులు నిరాకరించడంతో సౌమ్యారెడ్డి విజయం సాధించినట్లు పత్రాన్ని సమర్పించారు. దీంతో ఆమె గెలిపు ఖరారు కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాలను కైవసం చేసుకోగా.. బీజేపీ 66, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

Show comments