Bharat Ratna: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత దేశమంతా అతని గురించే చర్చిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అతను అతిక్ అహ్మద్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ ప్రకటనే అతడికి సమస్యలను తెచ్చిపెట్టింది. తన సొంత పార్టీ అతడిని బహిష్కరించింది.
Read Also: Badri @23 years: పవన్ కల్యాణ్ నటించిన సెన్సేషనల్ హిట్ బద్రికి 23ఏళ్లు
రాజ్‌కుమార్ సింగ్ అలియాస్ రజ్జు భయ్యా మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రయాగ్‌రాజ్ నుంచి పోటీ చేశారు. అయితే వివాదాస్పద ప్రకటనతో ఆయనను పార్టీ నుంచి తొలగించబడ్డారు. అతని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతిక్ అహ్మద్ అమరవీరుడని.. అతనికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పాటు యోగి ప్రభుత్వంపై హత్యా ఆరోపణలు చేశాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించి, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది. రజ్జు ప్రకటన వ్యక్తిగతమని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రాజ్‌కుమార్ సింగ్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో, పార్టీ మున్సిపల్ ఎన్నికలకు రజ్జు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది.
Read Also:TPCC Protest event: నిరుద్యోగ సభ రద్దు కాలేదు.. కొత్త డేట్ ఇదే..
ఉమేష్ పాల్ హత్య కేసులో పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్, ఏప్రిల్ 15 రాత్రి కెల్విన్ హాస్పిటల్ వెలుపల హత్యకు గురయ్యాడు. అతిక్ అహ్మద్ కొడుకును పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతిక్ భార్య కూడా పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్థుడు అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్‌లకు మద్దతుగా మహారాష్ట్రలో బ్యానర్లు వెలిశాయి. బీడ్ సిటీలో వేసిన ఈ పోస్టర్లలో మాఫియా సోదరులిద్దరినీ అమరవీరులుగా పేర్కొంటున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న మహారాష్ట్ర పోలీసులు వెంటనే బీడ్‌లోని మజల్‌గావ్ చౌక్ లో ఈ పోస్టర్‌ను తొలగించారు. పోస్టర్లు వేసిన నలుగురు నిందితులను రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించినందుకు 293, 294, 153 సెక్షన్ల కింద అరెస్టు చేశారు.