Site icon NTV Telugu

Congress: బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. గవర్నర్‌ను కలవనున్న టీకాంగ్రెస్ నేతలు

Congress

Congress

Congress: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో, టీకాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బీసీ వర్గాలకు విద్య , ఉద్యోగ రంగాలలో మరింత న్యాయం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

 Ajith : గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఈ బిల్లు చట్టంగా మారేందుకు మార్గం సుగమం అయింది. ఈ సందర్భంగా టీకాంగ్రెస్ బీసీ నేతలు గవర్నర్‌ను కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అలాగే, ఈ బిల్లు అమలుకు సంబంధించిన తదుపరి చర్యలపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బీసీ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరింత కృషి చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Delhi: ఢిల్లీని మరోసారి హడలెత్తించిన భారీ వర్షం.. దుమ్ము తుఫాన్.. ఫ్లైట్స్‌కు అంతరాయం

Exit mobile version