Bharat Jodo Yatra: మొదటి విడత భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండో విడత యాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రెండు విడత యాత్ర ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి మేఘాలయా వరకు రెండో విడత భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. గాంధీ పుట్టిన గడ్డ నుంచే గాంధీ జయంతి రోజునే ఈ యాత్ర ప్రారంభం కానుండడం గమనార్హం. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకు వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి నడుం బిగించారు. 2024 జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత యాత్ర ముగియనుంది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా విస్త్రత స్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: MGNREGS: ఉపాధి హామీ కింద సెప్టెంబర్ 1 నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపు తప్పనిసరి
తొలిదశ భారత్ జోడోయాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ యాత్రను కొనసాగించారు. రెండో విడతలో భారత్ జోడో యాత్రలో గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిదశలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4వేల కిలోమీటర్లు రాహుుల్‌గాంధీ పాదయాత్రలో నడిచారు.