Site icon NTV Telugu

Dhurandhar2 : ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్ పై గందరగోళం

Dhurandhar 2

Dhurandhar 2

 సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ధురంధర్ 2’ ఒకటి. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దేశభక్తి, యాక్షన్ అంశాలతో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. చాలా రోజులుగా అభిమానులు ‘ధురంధర్ 2’ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజైనా ట్రైలర్ అప్‌డేట్ వస్తుందేమో అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Also Read : KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు వరుస తలనొప్పులు

అయితే ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. దేశం మొత్తం ప్రశంసించిన దర్శకుడు ఆదిత్య ధర్ దగ్గరే ట్రైలర్ విషయంలో స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రైలర్ మాత్రమే కాదు, సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చిత్ర బృందం ఈ విషయాన్ని పూర్తిగా సీక్రెట్ మిషన్ లాగా ఉంచుతున్నట్టు కనిపిస్తోంది.అయితే సినిమా మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అభిమానులు ఇప్పుడు ఒక్క అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈరోజైనా ‘ధురంధర్ 2’ ట్రైలర్ పై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version