NTV Telugu Site icon

Anantapur: సీఎం పర్యటన ఏర్పాట్లలో అపశృతి

Atp

Atp

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా.. హోర్డింగ్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కార్మికుడికి స్వల్పగాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీఎం సభాప్రాంగణం దగ్గర ఈ సంఘటన జరిగింది. హోర్డింగ్‌ కూలడంతో… ఓ కారు ధ్వంసమైంది.

కాగా, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపటి నుంని మూడు రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. కడప జిల్లా ఇడుపులపాయ చేరుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వెళ్తారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో పాల్గొని డాక్టర్‌ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని ఖాతాల్లో జమ చేస్తారు. ఈ తర్వాత కడప జిల్లా వెళ్తారు సీఎం జగన్‌.

కళ్యాణదుర్గం నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుంటారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా YSR ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు. రేపు రాత్రికి ఇడుపులపాయలోనే ఉంటారు. ఎల్లుండి ఉదయం 9గంటల 20 నిమిషాలకు గండికోట చేరుకుని ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను సీఎమ్ జగన్ పరిశీలిస్తారు. ఈ తర్వాత పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కీలకమైన వైఎస్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి కూడా ప్రారంభిస్తారు. చి ఇడుపులపాయ చేరుకుంటారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9గంటలకు ఇడుపులపాయ నుంచి కడప వెళ్లి… అక్కడా అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కడప నుంచి కొప్పర్తి వెళ్లి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు సీఎం జగన్‌.