Farmers Protest: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. పత్తిరేటు తగ్గించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం ప్రారంభం అయిన వ్యవసాయ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో పత్తిని రైతులు తీసుకువచ్చారు. పత్తి బస్తాలు ఎక్కువ రావడంతో 6800 జెండా పాట పలకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ పత్తికి 6,800 అయితే తేమతో ఉన్న పత్తికి 5500 ధర పలకడంతో రైతులు మండిపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. మద్దతు ధరకు కూడా నోచుకోలేని పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Hyderabad CP: హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు.. కారణమిదే..!