సికింద్రాబాద్ (కంటోన్మెంట్) ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు జీ సాయన్న ఆదివారం యశోద ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయన్నకు భార్య మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే.. సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలు లేకుండానే ముగిశాయి. మారేడుపల్లిలోని శ్మశానవాటికలో సాయన్న చితికి ఆయన అల్లుడు నిప్పటించారు. కాగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ఆయన అనుచరులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. సినీ నటులను, ఏపీకి చెందిన వారు చనిపోతే ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని…కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించపోవడం ఏమిటని అభిమానులు ప్రశ్నించారు.
Also Read : Sri Krishnadevaraya University: శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో మరో వివాదం.. వీసీ సర్క్యులర్ దుమారం
ఈ సందర్బంగా కేసీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి కూడా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని మండిపడ్డారు. 30 ఏండ్లు ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యేను ఇలా అవమానించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డిలు వెళ్లిపోయారు. తర్వాత పద్మారావు గౌడ్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పినట్లు సమాచారం.
Also Read : Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. హైకోర్టు బెయిల్ మంజూరు