NTV Telugu Site icon

Cricket: ఒకే మ్యాచ్లో మూడుసార్లు ‘టై’.. ఇంతకీ ఏ మ్యాచ్ అంటే..?

Cricket

Cricket

సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఇరు జట్లు ఒకే స్కోరును చేస్తే.. ఆ మ్యాచ్ టై అవుతుంది. మళ్లీ తిరిగి సూపర్ ఓవర్ పెడుతారు. అలా.. ఒకే మ్యాచ్లో మూడుసార్లు టై అయింది. ఇంతకీ ఎక్కడా.. ఏ మ్యాచ్ అనుకుంటున్నారా..?. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 17వ మ్యాచ్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై అయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న హుబ్లీ టైగర్స్ 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. బెంగళూరు బ్లాస్టర్స్‌ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో.. మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్‌కు వెళ్లారు. అయితే ఇక్కడ కూడా రెండుసార్లు సూపర్ ఓవర్ టై అయింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్‌లో చివరి బంతికి హుబ్లీ టైగర్స్ జట్టు విజయం సాధించింది.

Home Minister Anitha: అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి

కాగా.. మొదటిసారి మ్యాచ్ టై అయిన తర్వాత రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. అందులో కూడా టైగా ముగిసింది. బెంగళూరు బ్లాస్టర్స్ తొలి సూపర్ ఓవర్‌లో 11 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. బరిలోకి దిగిన హుబ్లీ జట్టు 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. టైగా ముగిసింది. మళ్లీ రెండో సూపర్ ఓవర్ జరగ్గా ఇందులో హుబ్లీ తొలుత బ్యాటింగ్ చేసి 8 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు కూడా ఒక వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ 13 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో.. హుబ్లీ జట్టు సూపర్ ఓవర్‌లో చివరి బంతికి ఫోర్ కొట్టి 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. రెండు సూపర్ ఓవర్లు కూడా టైగా ముగిసిన తర్వాత.. మూడో సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం తేలింది.

Kolkata doctor case: సందీప్ ఘోష్‌కు సీఎం మమత బర్త్‌డే విషెస్ చెప్పిన లేఖ వైరల్