Site icon NTV Telugu

Minister Audimulapu Suresh: ఆయన ఎస్సీ కాదు.. మంత్రి ఆదిమూలపు సురేష్‌పై ఫిర్యాదు

Audimulapu Suresh

Audimulapu Suresh

Minister Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్‌పై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో ఓ ఆసక్తికరమైన ఫిర్యాదు అందింది.. అసలు ఆదిమూలపు సురేష్‌.. ఎస్సీ కాదంటూ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేశారు.. తన ఫిర్యాదుపై విచారణ చేయాలంటూ మార్కాపురానికి చెందిన పి ఇమ్మానుయేలు.. జిల్లా కలెక్టర్ దినేష్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు.. జెడ్పీ హైస్కూలులో హెచ్ఎంలుగా పనిచేసి రిటైర్ అయిన మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రులు.. అనంతరం బీసీ(సీ)లుగా క్రిస్టియన్ కోటాలో శ్రీరాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కాలేజీ ఏర్పాటు చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఆ ప్రకారం వారి పిల్లలుగా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా బీసీ(సీ) కిందకు వస్తారని.. తన ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు ఇమ్మానుయేలు అనే వ్యక్తి.. అయితే, ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చగా మారింది. కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆదిమూలపు సురేష్‌.. ఎస్సీ కోటాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ వన్‌లో మంత్రి పదవి పొందారు.. ఇక, జగన్‌ కేబినెట్‌ -2లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా.. మరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు ఆదిమూలపు సురేష్‌. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో.. ఆయన ఎస్సీ కాదంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

Read Also: Weather Weather Update: 20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. ఆలస్యంగా రైళ్ల, విమానాల రాకపోకలు!

Exit mobile version