Site icon NTV Telugu

King Fisher beers : కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. 30కి.మీ పోతున్నాం

Kf Beer

Kf Beer

King Fisher beers : జగిత్యాల కలెక్టర్ కు వింత అనుభవం ఎదురైంది. బీర్లలో రారాజైన కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఓ వ్యక్తి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాడు. చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని బీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో ఆ జిల్లా అదనపు కలెక్టర్ లతకు ఫిర్యాదు చేశాడు. కల్తీ మద్యం, నాసిరకం బీర్లు అమ్ముతున్నారని, దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు.

Read Also: chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్

జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, అందులో ఒక్కో బీర్ కు రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారని కలెక్టర్ ముందు వాపోయాడు. వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను కోరాడు. వైన్ షాపుల్లో దొరక్కుండా బెల్టు షాపులలో బీర్లు దొరుకుతున్నాయని, అయితే బెల్టు షాపుల్లో అమ్మేవి ఒరిజినలా? నకిలీవా? అనేది అర్ధం కావడం లేదన్నాడు. జగిత్యాల టౌన్‌లో కేఎఫ్ బీర్లు దొరకడం లేదని చెబుతున్నాడు. మిగిలిన చోట్ల దొరుకుతున్నాయని చెప్పాడు. కేఎఫ్ బీర్ల కోసం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు.

Read Also: KTR Public Meeting Live: వరంగల్ లో కేటీఆర్ బహిరంగ సభ లైవ్

ప్రస్తుతం అతడి వినతిపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందుబాబుల తరపున తన వాణి వినిపించాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అతడి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందా?.. రాష్ట్రంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Exit mobile version