Madhavi Latha: నటిగా గుర్తింపు తెచ్చుకున్న మాధవీలత, గత కొంతకాలంగా సామాజిక మరియు రాజకీయ అంశాలపై చాలా ఘాటుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, ఈసారి ఏకంగా దైవంగా భావించే సాయిబాబాపైనే అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలు రావడంతో పెను వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా సినీ నటి మాధవీలత చుట్టూ కొత్త వివాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. షిరిడీ సాయిబాబాపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.
READ ALSO: Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సాయిబాబాకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే నటి మాధవీలత కూడా బాబాపై అభ్యంతరకర రీతిలో స్పందించారని, తద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కేవలం మాధవీలత మాత్రమే కాకుండా, ఈ వివాదాన్ని ప్రోత్సహించిన పలువురు యూట్యూబర్లపై కూడా ఫిర్యాదులు అందాయి. ప్రజల మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించినందుకు గాను, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మాధవి లత మీద ఫిర్యాదు నమోదైంది. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం మాధవీలతతో పాటు మరికొందరు యూట్యూబర్లపై సైతం కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మాధవీలత తదుపరి స్పందన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
READ ALSO: Gold and Silver Price: 21 వేలు పడిపోయిన సిల్వర్ రేట్.. 4 వేలు తగ్గిన బంగారం ధర!
