NTV Telugu Site icon

Complaint against PM Modi: ప్రధాని మోడీపై ఈసీకి టీఎంసీ ఎంపీ ఫిర్యాదు

Pm Modi Jagital Meeting

Pm Modi Jagital Meeting

Complaint against PM Modi: ప్రధాని నరేంద్ర మోడీపీ భారత ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడుసాకేత్‌ గోఖలే ఫిర్యాదు చేశారు. రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణంగానే 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తోన్న ప్రధాని మోడీ ఏపీ పర్యటన కోసం ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని సాకేత్‌ గోఖలే ఆరోపించారు.