NTV Telugu Site icon

Chilukuru : మసీదు కాదు- గుర్రాల శాల

Chilkuru

Chilkuru

మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ సమీపంలో నిన్న రాత్రి మసీదును కూలగొట్టారని నెపంతో పెద్ద మొత్తంలో హైదరాబాదు నుంచి ముస్లింలు అక్కడికి చేరుకొని ప్రార్థనలు నిర్వహించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ మళ్లీ మసీదును నిర్మించాలని చెప్పడంతో అధికారులు ఇది మత కల్లోలం జరుగుతుందనే నేపంతో దానిని పునర్ నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ చిలుకూరు ప్రజలు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. అది మసీదు కాదు గుర్రాల శాల మాత్రమేనని ముక్తకంఠంతో చిలుకూరు ప్రజలు , చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. మేము చూసినప్పటి నుంచి ఎప్పుడు ఇందులో ప్రార్థనలు జరిగిన దాఖలాలు లేవని అలాగే దానికి దారి కూడా లేదని లేదని ఇక్కడ మసీదు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదని ప్రజలు తెలుపుతున్నారు. మసీదు నిర్మించాలంటే పగలు నిర్మించాలి కానీ రాత్రిపూట పని ఏమిటి అని ఇది మత కల్లోలానికి దారితీస్తుందని వాళ్ళు భయాందోళనలు చెందుతున్నారు. వెంటనే అధికారులు పట్టించుకోని ఈ మసీదు నిర్మాణాన్ని నిలిపివేయాలని చిలుకూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు.