Site icon NTV Telugu

Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..

Committee Kurrollu

Committee Kurrollu

Committee Kurrollu Releasing On August 9 : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా లాంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ” కమిటీ కుర్రోళ్లు “. యాదు వంశీ దర్శకత్వం విహిస్తున్న ఈ సినిమాను.. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే టీజర్‌ తో పాటు ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ ను అప్డేట్ చేసారు మూవీ మేకర్స్. ఆగస్టు 9 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో సోషమీడియాలో తెలిపారు.

CPI Ramakrishna: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. రైల్వే జోన్ పనులు ప్రారంభించాలి..

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్య, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి ఈసినిమాలో ప్రధాన నటీనటులుగా నటించారు. 1990 బ్యాక్‌ డ్రాప్‌ లో మొదలైన ప్రస్తుత తరం యువత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చిన్ననాటి సంఘటనలను గుర్తు చేస్తూ ఆకట్టుకుంది.

G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..

Exit mobile version