NTV Telugu Site icon

Comedian Khyali Saharan: మద్యం మత్తులో యువతిపై హాస్యనటుడు అత్యాచారం

Khyali Saharan

Khyali Saharan

Comedian Khyali Saharan: హాస్యనటుడు ఖ్యాలీ సహారన్‌పై జైపూర్‌లో అత్యాచారం కేసు నమోదైంది. హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని 25 ఏళ్ల యువతి ఆరోపించింది. జైపూర్‌లోని ఓ హోటల్ గదిలో 25 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ ఖ్యాలీ సహారన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్యనటుడిపై మంగళవారం మానసరోవర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నాడు ఆప్‌ కార్యకర్త అయిన హాస్యనటుడు మద్యం మత్తులో మానసరోవర్ ప్రాంతంలోని ఒక హోటల్ గదిలో ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్యనటుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేయబడింది. ఈ విషయం దర్యాప్తు చేయబడుతోందని అని మానసరోవర్ ఇన్‌స్పెక్టర్ సందీప్ యాదవ్ తెలిపారు. శ్రీగంగానగర్‌కు చెందిన మహిళ ఓ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరో మహిళతో కలిసి ఉద్యోగం కోసం సహాయం కోరుతూ దాదాపు నెల రోజుల క్రితం కమెడియన్‌తో పరిచయం ఏర్పడింది.

Read Also: TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్.. దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు..!

ఖ్యాలీ ఒక హోటల్‌లో రెండు గదులను బుక్ చేశాడు, ఒకటి తనకు, మరొకటి ఇద్దరు మహిళల కోసం బుక్ చేశాడు. హాస్యనటుడు బీర్ తాగాడని, మహిళలను బలవంతంగా బీర్ తాగమని అడిగాడు. ఆ తర్వాత ఒక మహిళ గది నుంచి బయటకు వెళ్లగా.. మరో మహిళపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యోగేంద్ర గుప్తాను సంప్రదించగా.. ఆప్‌లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని, వారిలో ఖ్యాలీ ఒకరు అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ విషయానికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు.