NTV Telugu Site icon

Swathi: కలర్స్ స్వాతిని ‘ఛీ.. నీ బతుకు.. ‘ అంటూ మెసేజ్.. రిప్లై గట్టిగా ఇచ్చిందిగా..

Colours Swathi

Colours Swathi

కలర్స్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆన్‌స్క్రీన్ యాంకర్‌గా స్టార్ట్ అయిన జర్నీ., ఆపై హీరోయిన్‌గా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో “కలర్స్” అనే షో ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షో పేరును తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా సినిమా విడుదలైన తర్వాత స్వాతి పాపులారిటీ మారిపోయింది. ఆ తర్వాత కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్వాతి రీసెంట్‌గా ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతి సినిమాల్లో, నటన పరంగా రాణిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో వార్తతో ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు ఇదివరకు రాగా., అయితే దీనిపై స్వాతి ఎప్పుడూ స్పందించలేదు.

Also Read: Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..

తాజాగా మరోసారి ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. నిత్యం సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్వాతి., ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమె ఇటీవల తన స్నేహితులు, కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసింది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే, ఎప్పటిలాగే ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు ఈ వీడియోపై ‘ఛీ.. నీ బతుకు’ వ్యాఖ్యను చేసారు.

Also Read: Drinkers In TS: మందు బాబులకు అన్యాయం చేస్తే దబిడి దిబిడే.. తాగుబోతుల సంఘం కామెంట్స్..

ఇది చూసిన స్వాతి తనదైన శైలిలో స్పందిస్తూ.. కొన్నిసార్లు నాకూ అలాగే అనిపిస్తుంది అంటూ రిప్లై ఇచ్చింది. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం, కలర్స్ స్వాతి అందించిన కౌంటర్లు స్క్రీన్‌షాట్‌ లను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

Show comments