Site icon NTV Telugu

Sophia Qureshi: 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్..

Kureshi

Kureshi

కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ.. మే 6, 7 తేదీలలో భారత సైన్యం జైషే, హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో ఆయన వివరించారు. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా అన్నారు. పాకిస్తాన్, పీఓకేలలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసాము. లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని అన్నారు. 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగింది..

Also Read:Vikram Misri: పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది

పౌరులు లేని ప్రాంతాల్లోనే టార్గెట్ చేశాం.. పీవోకే, పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాం.. కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లో మొదటి లష్కర్ శిక్షణా కేంద్రం సవాయి నాలా ముజఫరాబాద్‌లో ఉందని సోఫియా, వ్యోమిక విలేకరుల సమావేశంలో తెలిపారు. సోనామార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందారు. ఈ శిక్షణా కేంద్రాన్ని సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు.

Also Read:Butchi Babu: బుచ్చిబాబకు మాటిచ్చిన మహేశ్ బాబు..!

రక్షణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని ఎల్ఈటీ క్యాంపుపై తొలి దాడి చేశాం.. ఎల్ఓసీలోని బింబల్ క్యాంపులో దాడి చేశాం.. ఇక్కడే లాష్కరే తోయిబా ఉగ్రవాడులకు ట్రైనింగ్ జరుగుతుంది.. పాకిస్తాన్ లోని సర్జల్ క్యాంపుపై దాడి చేశాం.. సర్జల్ క్యాంప్ ఎల్ఓసీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ముర్కిదే క్యాంపుపై దాడి చేశాం.. ఇక్కడ నుంచే ముంబై పేలుళ్ల దాడి జరిగింది.. కసబ్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.. ఈ దాడిలో భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదు.. ఇది భారత సాయుధ దళాల ప్రణాళికబద్ధ దాడికి నిదర్శనమని అన్నారు.

Exit mobile version