NTV Telugu Site icon

Football Player: గుండెపోటుతో కుప్పకూలి యువ ఆటగాడు కన్నుమూత

Andres Balanta

Andres Balanta

Football Player: కొలంబియా ఫుట్‌బాల్‌ జట్టులో విషాదం నెలకొంది. కొలంబియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా ఫస్ట్ డివిజన్ స్టార్ ఆండ్రెస్‌ బలంతా(22) శిక్షణలో కుప్పకూలి మరణించాడు.ఇటీవలే అట్లెటికో టుకుమన్‌ ట్రెయినింగ్‌ సెషన్‌లో ఆండ్రెస్‌ పాల్గొన్నాడు. కొన్ని నెలలుగా అర్జెంటీనా జట్టు అట్లెటికో టుకుమాన్ తరఫున ఆడుతున్న కొలంబియా మిడ్‌ఫీల్డర్ ఆండ్రెస్ బలంతా మంగళవారం శిక్షణ సమయంలో కుప్పకూలి మరణించాడు. దీంతో భయపడిన నిర్వాహకులు ఆండ్రెస్‌ను టుకుమన్‌ హెల్త్‌ సెంటర్‌ ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స తీసుకుంటూనే మంగళవారం గుండెపోటుతో ఆండ్రెస్‌ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఎంత ప్రయత్నించినా ఆండ్రెస్‌ను కాపాడలేకపోయామని వైద్యులు పేర్కొన్నారు.

India Womens squad: ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

ఇక 2021-22 సీజన్‌లో అట్లెటికో టుకుమన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆండ్రెస్‌ బలంతా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. కాగా ఆండ్రెస్‌ మృతిపై కొలంబియా ఫుట్‌బాల్ జట్టు తమ సంతాపం తెలిపింది. ఇక మాంచెస్టర్‌ సిటీ దిగ్గజం సెర్జియో ఆగురో ఆండ్రెస్‌ మృతిపై విచారం వ్యక్తం చేశాడు. ”బలంతా చనిపోవడం బాధాకరం. అతని ఆరోగ్య పరిస్థితి దృశ్యా వైద్యులు ఇకపై ఆండ్రెస్‌ ఫుట్‌బాల్‌ ఆడేందుకు వీల్లేదని చెప్పారు. కానీ ఇంతలోనే మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ స్థానంలో నేనున్నా బాగుండేది.. భరించడం కష్టంగా ఉంది. మిస్‌ యూ ఆండ్రెస్‌ బలంతా” అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు. ఈ వార్త తెలియగానే అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) తన సోషల్ మీడియా ఖాతాలలో సంతాప సందేశాన్ని ప్రచురించింది. ఇక ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు కొలంబియా అర్హత సాధించడంలో విఫలమైంది.

Show comments