NTV Telugu Site icon

Madhya Pradesh: బట్టల్లేకుండా వస్తానంటే.. కలెక్టర్ కమ్ అన్నాడంట

Student

Student

Madhya Pradesh: ఇదొక విచిత్రమైన వార్త.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కన్నయ్యకు చిన్నప్పటి నుంచి బట్టలంటే తెగ చిరాకు. అవి లేకుండానే తిరిగేవాడు.. ఇంత వరకు పెరిగాడు. వయసు పెరుగుతోంది చొక్కా ప్యాంట్ వేస్కో అని సూచించే వాళ్లతో ఏకంగా మాట్లాడడమే మానేశాడు. తప్ప వాటిని ధరించలేదు. ఇప్పుడు దుస్తులంటే చిరాకు అతడితోపాటే పెరిగి పెద్దదైంది. తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినిపించుకోని కన్నయ్య ఇప్పుడు కాలేజీకి ప్యాంటు, షర్టుకు బదులుగా తువ్వాలు కట్టుకుని వెళ్తున్నాడు. మరి కాలేజీ యాజమాన్యం ఏమీ అనలేదా? అంటే కలెక్టర్ ఆర్డర్ ఉంది మరి!

Read Also: Karnataka: అన్నదానానికి రూ.లక్ష విరాళం.. ఆ యాచకురాలికి ఇదేం కొత్త కాదు.. ఇది ఎన్నోసారో తెలుసా..

ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరేందుకు వెళ్తే చేర్చుకునేందుకు యాజమాన్యం నిరాకరించింది. దీంతో కన్నయ్య కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించింది. చదువుపై అతడికున్న మమకారాన్ని చూసి కరిగిపోయిన కలెక్టర్ పాఠశాలలో చేరేందుకు అనుమతి కల్పించారు. ఆ తర్వాత కాలేజీలో అడ్డంకులు వస్తాయేమోనని భయపడి పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. అయితే, అందుకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. పాఠశాలలో చదువుకునేటప్పుడు కలెక్టర్ అనుమతి ఉండడంతో కాలేజీలో కూడా పెద్దగా కష్టపడకుండానే సీటు లభించింది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కన్నయ్య అండర్ వేర్, తువ్వాలు ధరించి మాత్రమే కాలేజీకి వస్తున్నాడు. తొలుత తోటి విద్యార్థులు వింతగా చూసినా ఇప్పుడు వారికీ అలవాటైపోయింది.