ఇటీవలే ఓ నూతన వధువు బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఆమె డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఎక్కువగా షేర్ అయింది. అయితే తాజాగా ఈ పాటకు ఓ నర్సు చేసిన డాన్స్ వీడియో వైరల్ అయింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్‌కి చెందిన నర్సు ఆస్పత్రి ప్రాంగణంలో ఈ డాన్స్ చేసింది. కాగా, ఆ నర్సు ఆస్పత్రిలో చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కలెక్టరు కూడా సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశమిచ్చారు. ఈమేరకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావుకు మెమో జారీ చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలి కోరారు. ఇదిలా ఉండగా.. నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శల చేస్తున్నారు.
ఆమె డాన్స్ చేయడం పెద్ద తప్పుగా భావించాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు అంటున్నారు.. అలా అయితే కోవిడ్ ఆసుపత్రుల్లో వారి రోగుల మనోధైర్యం కోసం అనేక చోట్ల నర్సులు పాటలు, డాన్సులు చేసిన వీడియోలు షేర్ చేస్తూ.. మరి వారి సంగతి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొంప ముంచిన బుల్లెట్ సాంగ్.. విచారణకు కలెక్టర్ ఆదేశం
