గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయ సరిహద్దు గోడ కుప్పకూలింది. కాగా.. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. నాలుగో నంబర్ గేటు సమీపంలో నిర్మించిన గోడ కూలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
Read Also: Israel-Lebanon: లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు
పలువురిని శిథిలాల కింద నుంచి తొలగించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద ఎంత మంది ఉన్నారని అనేది స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కాగా.. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: CM Chandrababu: జగన్ తిరుమల పర్యటన అందుకే రద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు