Site icon NTV Telugu

Cough Syrup Tragedy: దగ్గు సిరప్ కేసులో సంచలన నిజాలు.. కమీషన్‌కి కక్కుర్తి పడ్డ వైద్యుడు..!

Cough Syrups

Cough Syrups

Cough Syrup Tragedy: కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ వల్ల అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చింద్వారాలో 24 మంది పిల్లల మరణాల కేసులో ఈ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అక్టోబర్ 8న, కోర్టు డాక్టర్ ప్రవీణ్ సోనికి బెయిల్ నిరాకరించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వడాన్ని నిషేధించిన 2023 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వైద్యుడు పాటించలేదని కోర్టు పేర్కొంది. కోల్డ్రిఫ్ సిరప్‌ను పిల్లల ఔషధంగా సూచించినందుకు కంపెనీ తనకు 10 శాతం కమీషన్ చెల్లించిందని నిందితుడు డాక్టర్ ప్రవీణ్ సోని తన మెమోరాండం స్టేట్‌మెంట్‌లో అంగీకరించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసులు దీనిని “వైద్య నీతి, విధి నిర్లక్ష్యం, నేరపూరిత ఉల్లంఘన”గా అభివర్ణించారు. ఇక్కడ నిందితుడు(డాక్టర్) రోగుల భద్రత కంటే 10 శాతం కమిషన్ ప్రయోజనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ డాక్టర్‌కి కోల్డ్రిఫ్ సిరప్ స్టాకిస్ట్ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నారు. తాను ఇచ్చిన సిరప్ తాగిన రోగులలో ప్రతికూల ప్రతిచర్యలు ఉన్నట్లు నివేదికలు వచ్చినప్పటికీ, వైద్యుడు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఆరోగ్య అధికారులకు సమాచారం సైతం అందించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. తాను సూచించిన మందులు, కోల్డ్రిఫ్ సిరప్ తీసుకున్న తర్వాత పిల్లలు మూత్ర పిండాల వ్యాధి, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యుడికి తెలుసని పరిశోధకులు పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఈ మందును పిల్లలకు సూచించడం మాత్రం మానలేదు. కమీషన్ కోసం కక్కుర్తి పడి పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు.

READ MORE: MLA Vasantha Krishna Prasad: జగన్‌ మార్గదర్శకత్వంలో జోగి రమేష్‌ నకిలీ మద్యం వ్యాపారం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..

మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో 20 మంది వరకు చిన్నారుల మృతికి కారణమని భావిస్తున్న దగ్గు మందు తయారీ ప్లాంట్‌ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ లో సిరప్‌ కోల్డ్రిఫ్‌ తాగిన చిన్నారులు కిడ్నీలు ఫెయిలై మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణల తో ఈ సిరప్‌ విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీనే నిషేధం విధించింది. మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. సిరప్‌లో ప్రమాదకర రసాయనా లున్నా యంటూ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఔషధ విభాగం ప్రకటించింది. తక్షణమే కోల్డ్రిఫ్‌ ఉత్పత్తిని నిలిపి వేయాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మందును మధ్యప్రదేశ్, కేరళ కూడా నిషే ధించాయి. కోల్డ్రిఫ్‌ సిరప్‌ విక్రయాలను నిలిపివే యా లంటూ పుదుచ్చేరి, ఒడిశా ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది.

READ MORE: Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

Exit mobile version