NTV Telugu Site icon

Chandrababu Dehydration: చంద్రబాబుకు డీహైడ్రేషన్.. క్లారిటీ ఇచ్చిన జైళ్లశాఖ డీఐజీ

Chandrababu Arrest

Chandrababu Arrest

Chandrababu Dehydration: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారనే వార్తలు వచ్చాయి.. వేడి, ఉక్కబోత ఎక్కువగా ఉన్నట్టు ఆయనను మంగళవారం ములాకత్‌లో కలిసిన కుటుంబసభ్యులకు చెప్పినట్టు.. దీంతో వారిలో ఆందోళన మొదలైనట్టు సమాచారం.. అయితే, దీనిపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ కిరణ్‌ స్పందించారు.. చంద్రబాబుకి డీహైడ్రేషన్ కి గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని కొట్టిపారేశారు..

Read Also: Gill-Sara Dating: డోంట్ వర్రీ బేబీ.. సారా టెండూల్కర్‌ ట్వీట్‌ వైరల్!

చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటే కచ్చితంగా నాకు సమాచారం వస్తుందన్నారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.. డీహైడ్రేషన్ కి గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్న ఆయన.. చంద్రబాబుకి కోర్టు గైడెన్స్ ప్రకారం సౌకర్యాలు కల్పిస్తున్నాం.. రోజుకి మూడు సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నట్లు కూడా చంద్రబాబు చెప్పలేదన్నారు.. ప్రోటోకాల్ ప్రకారం తమ పని తాము చేస్తున్నట్టు వెల్లడించారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్. మరోవైపు.. రేపటి నుంచి నాలుగు రోజులు పాటు సెలవు పై వెళ్లనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్.. దీంతో, ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్ కుమార్‌కి బాధ్యతలు అప్పగించారు ఉన్నతాధికారులు.