Site icon NTV Telugu

Fish Meat: ల్యాబ్ లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్..

Fish

Fish

భారతదేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ( CMFRI) ఒక కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. సీఫుడ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.. దాని ద్వారా సముద్రజీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించొచ్చని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది. ఇక, చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో డెవలప్ చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయని తెలిపింది. అయితే, తొలి దశలో కింగ్‌ ఫిష్‌, చందువా చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నాట్లు ప్రకటించింది. కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ నీట్‌ మీట్‌ బయోటెక్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది.

Read Also: Bode Prasad: టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా కృషి చేయాలి..

అయితే, ఇరు సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ వివరించింది. ఈ ఒప్పందం ప్రకారం.. అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్‌లైన్‌ డెవలప్మెంట్ పై సీఎంఎఫ్‌ఆర్‌ఐ పరిశోధన చేస్తున్న్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతున్నట్లు చెప్పింది. జన్యు, జీవ రసాయనపరమైన అంశాలను విశ్లేషిస్తుందని సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాథమిక సౌకర్యాలతో సెల్‌ కల్చర్‌ లేబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు సెల్‌ కల్చర్‌ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న నీట్‌ మీట్‌, సెల్‌ గ్రోత్‌ మీడియా ఆప్టిమైజేషన్‌, సెల్‌ అటాచ్‌మెంట్‌ బయోరియాక్టర్ల ద్వారా ఉత్పత్తి లాంటి కార్యకలాపాలను చేపడుతున్నట్లు సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చెప్పుకొచ్చింది.

Exit mobile version