CMF Buds Pro 2 Price and Offers in India: లండన్‌కు చెందిన ‘నథింగ్’ సబ్‌బ్రాండ్ ‘సీఎంఎఫ్’ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘సీఎంఎఫ్ ఫోన్ 1’ పేరిట ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటుగా స్మార్ట్ వాచ్, బడ్స్‌లను కూడా సీఎంఎఫ్ భారత్‌లో రిలీజ్ చేసింది. ‘సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2’ పేరుతో కొత్త బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్‌ను అందించారు. ఇది 50డీబీ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో సపోర్ట్‌తో వస్తోంది.
Also Read: IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 ధర రూ.4,299గా ఉంది. ఇది క్లియర్ వాయిస్ టెక్నాలజీ 2.0, విండ్ నాయిస్ రిడక్షన్ 2.0తో వస్తోంది. దీంతో నాణ్యతతో కూడిన కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 43 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందులో 60 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. పూర్తిగా చార్జ్ చేయడానికి 70 నిమిషాలు పడుతాయి. జులై 12వ తేదీ నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.