Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం.. రేపు జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమచేయనున్నారు.. అయితే, ఇప్పుటికే రెండో సార్లు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన వాయిదా పడింది.. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో, భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనుకోని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇక, ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మరోసారి అధికారులు ప్రకటించారు.. దీనికి కూడా ఏర్పాట్లు జరిగాయి.. కానీ, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో మరోమారు వాయిదా పడింది.. మొత్తంగా రేపు అనగా ఈ నెల 24న సీఎం కొవ్వూరులో పర్యటించనున్నారు సీఎం జగన్.
Read Also: Anthony Albanese : మోడీ ఈజ్ ది బాస్ అంటూ ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రధాని
కొవ్వూరు పర్యటన కోసం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. కార్యక్రమం అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మరోవైపు.. రేపు కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రాజమండ్రి – కొవ్వూరు మధ్య వాహనాలను గామన్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు పోలీసులు.