NTV Telugu Site icon

Dr BR Ambedkar Statue: ప్రారంభోత్సవానికి సిద్ధమైన అంబేద్కర్ స్మృతి వనం.. అర్ధరాత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు

Ambedkar Statue

Ambedkar Statue

Dr BR Ambedkar Statue: విజయవాడలో అత్యంత సుందరంగా నిర్మాణం అవుతోంది డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ స్మృతివనం.. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా.. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది.. అయితే ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తు్నారు.. ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి.. తనిఖీల్లో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పాల్గొన్నారు.. అక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించి.. పెండింగ్‌లో ఉన్న మిగతా పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

Read Also: Michael Clarke: అతడు ఓపెనర్‌గా వస్తే.. బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు!

భారత దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం మారుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి.. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు. అత్యంత సుందరంగా, దేశంలోని తెలుగు ప్రజలు అందరు గర్వపడేలా నిర్మాణం జరుగుతుందన్నారు. అంబేద్కర్ స్మృతి వనం పనులు చివరి దశకు వచ్చాయని.. జనవరి 19న ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతుందన్నారు. ఇప్పటికే స్మృతి వనం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.. మిగిలి ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా విగ్రహం ప్రాంగణంలో చేపడుతున్న పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ స్మృతి వనం పర్యటక ప్రాంతంలో మారిపోతుందని తెలిపారు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి.

Read Also: Ecuador Gunmen: లైవ్ నడుస్తుండగా తుపాకులతో స్టూడియోలోకి ప్రవేశించిన దుండగులు.. బీభత్సం

కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు దాదాపు ఏడాది క్రితమే పూర్తి కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం కొనసాగుతూ వచ్చింది.. దీంతో.. ప్రారంభోత్సవం కూడా పలు మార్లు వాయిదా పడింది. విజయవాడలో 19 ఎకరాల విస్తరణలో అభివృద్ధి చేస్తున్న అంబేద్కర్ స్మృతివనంలో మ్యూజియంలో ప్రదర్శించే ఛాయాచిత్రాలు మరియు కళాఖండాలు అంబేద్కర్ ఆయన చిన్నతనంలో చేసిన కృషిని మరియు దేశంలో అత్యంత గౌరవమైన నాయకుడిలా మారడానికి తన మార్గంలో అడ్డంకులను ఎలా అధిగమించారో తెలియజేసే చిత్రాలను కూడా పొందుపరిచారు.. అంబేద్కర్‌ కృషిని ఆడియో, వీడియోల ద్వారా తెలిపేందుకు మినీ థియేటర్ సిద్ధం చేశారు.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.. స్వరాజ్య మైదానంలో రెండు దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులను తొలి దశలో రూ.268.46 కోట్లు, మలి దశలో రూ.106.64 కోట్లు.. సుమారుగా రూ.400 కోట్లతో దీర్చిదిద్దుతున్నారు. లైటింగ్, పెయింటింగ్, మినీ థియేటర్, మ్యూజియం, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, విగ్రహం ముందు, వెనుక భాగాల్లో ఉద్యానవనాలతో సుందరీకరణ, భవనాలు, ప్రహారీ గోడల నిర్మాణం, లిఫ్టులు, వెహికల్ పార్కింగ్, ఫుడ్ కోర్ట్ ఇలా ఎన్నో హంగులతో తీర్చిదిద్దుతున్నారు.