NTV Telugu Site icon

CM YS Jagan Tour Postponed: ఏపీలో భారీ వర్షాలు.. సీఎం జగన్‌ పర్యటన వాయిదా

Ys Jagan

Ys Jagan

CM YS Jagan Tour Postponed: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.. ఇక, నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. గూడూరు డివిజన్ లోని కోట.. వాకాడు.. చిల్లకూరు.. నాయుడుపేట డివిజన్లోని సూళ్లూరుపేట.. తడ ప్రాంతాల్లో అధిక వర్షం నమోదవుతోంది.. వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, వర్షాల నేపథ్యంలో.. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వాయిదా పడింది..

Read Also: Reliance Jio Laptop: రిలయన్స్ జియో నుంచి క్లౌడ్ ల్యాప్‌టాప్‌.. ధర 15 వేలు మాత్రమే!

షెడ్యూల్‌ ప్రకారం.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ రోజు సూళ్లూరుపేటలో పర్యటించాల్సి ఉంది.. కానీ, వర్షాల కారణంగా సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.. ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం నుంచి.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది.. కానీ, భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేశారు.. త్వరలోనే తదుపరి తేదీని ప్రకటించనున్నట్టు సీఎంవో అధికారులు చెబుతున్నారు..

Show comments