CM YS Jagan: ఏపీలో హీరో ఎవరో.. విలన్ ఎవరో.. ప్రజలు తెలుసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. కూటమి అభ్యర్థులు మీ ఇంటికి వచ్చినప్పుడు జగన్ ఎందుకు ఓడించాలి ప్రశ్నించాలని ఆయన ప్రజలను కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్నందుకా, గతంలో ఎవరు ఇవ్వలేని విధంగా అవినీతికి త్రోవ లేకుండా సంక్షేమ పథకాలు అందించినందుకా అని ప్రశ్నించాలన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలోచన చేసి ఓటెయ్యాలన్నారు. కేజీ బంగారం ఇస్తానని చెబితే తీసుకోండి కానీ మీ ఇంటిలో మంచి జరిగితే ఫ్యాన్‌కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రియల్ హీరో ఎవరో విలన్ ఎవరో మీరే తెలుసుకుని ఓటు వేయాలని.. అంబాజీపేట బహిరంగ సభలో సీఎం జగన్ అభ్యర్థించారు.
Read Also: TDP-BJP-Janasena Manifesto: రేపే టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో..
Also Read
వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్నా పేదోడి భవిష్యత్తు మారాలన్న పథకాలు నీకు కొనసాగాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలన్నారు. మీ జగన్ కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు… పొరపాటున చంద్రబాబు ఓటేస్తే పదకాల నీ ముగింపు మళ్లీ మోసపోవడమని విమర్శించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు. చంద్రబాబును కూటమిని ఒకటే అడుగుతున్నా… జగన్ ఎందుకు ఓడించాలని..? ఈ పథకాలన్నీ రద్దు చేయాలనా? అని ప్రశ్నించారు. 58 ఎనిమిది నెలల కాలంలో 66 లక్షల మందికి పెన్షన్లు…. అవ్వ తాతలకు ప్రతి ఒక్కరికి కూడా వేల రూపాయలు పెన్షన్ ఇంటికి పంపించినందుకా….. జగన్‌ను ఓడించాలా అని అడుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా 55 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా ఇచ్చినందుకు జగన్ని ఓడించాలా అని అడుగుతున్నానన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!