Site icon NTV Telugu

AP CM YS Jagan: మనం సిద్ధం అంటుంటే.. బాబు భార్య మా ఆయన సిద్దంగా లేడు అంటుంది..

Ap Cm

Ap Cm

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వీళ్ళు చెప్పుకుంటున్న అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వనివ్వలేదు.. అక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యత లోపిస్తుందని కేసులు వేయించారు.. జంకు, బొంకు లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు.. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ కూడా వద్దని ఆయన వాదించారు అని సీఎం ఆరోపించారు. బాబు పాపిష్టి జీవితం గడుపుతున్నారు.. అలాగే, ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు గతంలో మాట్లాడారు అనే విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు.. రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన బాబు..
పొదుపు సంఘాలను మోసం చేసిన బాబుకు మహిళల ఉసురు తగులుతుంది అని సీఎం జగన్ విమర్శించారు.

Read Also: Ravichandran Ashwin: భారత తొలి క్రికెటర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు!

రంగు రంగుల మ్యానిఫెస్టోలో 650 వాగ్దానాలు పెట్టారు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజీ కారు ఇస్తానని కూడా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు.. ఇన్ని దారుణాలు చేస్తున్నా కొన్ని పత్రికల్లో అబద్ధపు కథనాలు, డిబేట్లు చేస్తున్నారు.. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన ఈ పెద్ద మనిషి నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీం ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు బ్రష్టు పడుతున్నాయన్నారు. నేను ఏమైనా అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడు కానీ.. తాను చేసిన మంచిని మాత్రం చెప్పడం లేదన్నారు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏమీ చెప్పలేడు.. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్దంగా లేడు అంటుంది అని జగన్ అన్నారు.

Read Also: Medaram Jathara: మేడారంలో గవర్నర్‌.. వనదేవతలను దర్శించుకున్న తమిళిసై

ఏకంగా కుప్పంలో చంద్రబాబు బాయ్ బాయ్ అంటున్నారు అని సీఎం జగన్ తెలిపారు. ఆయనను ఏ నాడూ ఏపీకి రానివారు.. లేనివారు మాత్రమే సమర్థిస్తున్నారు.. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్ళు మాత్రమే సమర్థిస్తున్నారు.. చంద్రబాబుకు ఉన్నట్లు నాకు దత్తపుత్రుడి మద్దతు లేదన్నారు. మే ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మద్దతు ఇవ్వండి అని మాత్రమే అడుగున్నామని ఆయన కోరారు. నేను పైన దేవుడ్ని, క్రింద మిమ్మల్ని నమ్ముకున్నాను.. మీ ఇంట్లో జరిగిన మంచిని మాత్రమే కొలమానంగా తీసుకోండి.. ఎందుకంటే నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా.. ఏ దళారిని కూడా నమ్ముకొలేదు అని సీఎం జగన్ వెల్లడించారు.

Exit mobile version